సాహసనారి సంయుక్త
ABN , Publish Date - Sep 12 , 2024 | 03:56 AM
నిఖిల్ కథానాయకుడిగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభూ’. పీరియాడిక్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో నిఖిల్‌కు...
నిఖిల్ కథానాయకుడిగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభూ’. పీరియాడిక్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో నిఖిల్‌కు జోడీగా నభానటేష్, సంయుక్త నటిస్తున్నారు. బుధవారం సంయుక్త పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్రబృందం ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. యుద్ధ భూమిలో విల్లును ఎక్కుపెడుతున్న యోధురాలిగా ఆమె లుక్ అలరించింది. భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. అలాగే శర్వానంద్ సరసన సంయుక్త హీరోయిన్‌గా నటి స్తున్న చిత్రం (శర్వా 37-వర్కింగ్ టైటిల్) నుంచి ఆమె పాత్రను పరిచయం చేస్తూ ప్రత్యేక లుక్‌ను యూనిట్ విడుదల చేసింది.
ఈ చిత్రంలో దియా అనే పాత్రలో ఆమె కనిపించనున్నారు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలోనూ సంయుక్త హీరోయిన్‌గా నటిస్తున్నారు. మహేశ్ చందు నిర్మాత. సమీరా అనే పాత్రలో సంయుక్త నటిస్తున్నారు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా యూనిట్ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.