తప్పకుండా ఆదరించాలి

ABN , Publish Date - May 01 , 2024 | 05:44 AM

‘సగిలేటి కథ’ మూవీ ఫేమ్‌ రవితేజ మహాదాస్యం ఓ కొత్త చిత్రంలో నటిస్తున్నారు. మద్దుల మదన్‌కుమార్‌ దర్శకత్వం వహించగా, సౌజన్య కావూరి నిర్మిస్తున్నారు.

తప్పకుండా ఆదరించాలి

‘సగిలేటి కథ’ మూవీ ఫేమ్‌ రవితేజ మహాదాస్యం ఓ కొత్త చిత్రంలో నటిస్తున్నారు. మద్దుల మదన్‌కుమార్‌ దర్శకత్వం వహించగా, సౌజన్య కావూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ఇటీవలే ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో రవితేజ మహాదాస్యంపై విరాజ్‌ అశ్విన్‌ క్లాప్‌ కొట్టారు. పురాణపండ శ్రీనివాస్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఈ సందర్భంగా పురాణపండ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ‘‘సినీ రంగంలోకి ఎంతో మంది ప్రతిభావంతులు వస్తున్నారు. వారిని తప్పకుండా ఆదరించాలి’’ అన్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: అఖిల్‌ దేశ్‌పాండే, కెమెరామెన్‌ నితిన్‌ రెడ్డి చిమ్ముల, సహ నిర్మాతలు: దియా, సంజీవ్‌ కోనేరు, వెంకట్‌ రమణారెడ్డి.

Updated Date - May 01 , 2024 | 05:44 AM