రష్యన్‌ యువతి తెలుగు చిత్రం

ABN , Publish Date - Jul 03 , 2024 | 03:03 AM

రష్యాలో పుట్టి పెరిగిన లియుబా పామ్‌ గాయని, నిర్మాత కూడా. ‘సేవ్‌ ది చిల్డ్రన్‌’ పేరుతో ఓ డాక్యుమెంటరీ తీశారు. ‘లవ్‌ ఓవర్‌ ఈవిల్‌’ టీవీ సిరీస్‌కు రచయిత్రి, ప్రస్తుతం ‘నిన్ను వదలను’ పేరుతో...

రష్యాలో పుట్టి పెరిగిన లియుబా పామ్‌ గాయని, నిర్మాత కూడా. ‘సేవ్‌ ది చిల్డ్రన్‌’ పేరుతో ఓ డాక్యుమెంటరీ తీశారు. ‘లవ్‌ ఓవర్‌ ఈవిల్‌’ టీవీ సిరీస్‌కు రచయిత్రి, ప్రస్తుతం ‘నిన్ను వదలను’ పేరుతో రూపుదిద్దుకుంటున్న హారర్‌ సస్పెన్స్‌ చిత్రంలో లియుబా నటిస్తున్నారు. షిరాజ్‌ మెహది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కుష్బూ జైన్‌ కూడా మరో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. గోవా, హైదరాబాద్‌ ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతుంది. గంగాధర్‌, వైజాగ్‌ షరీఫ్‌, రవితేజ, అజయ్‌, అనంత్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ప్రవీణ్‌ కొమరి, ఎడిటింగ్‌: కె.ప్రభు, సహ నిర్మాత: దేవేంద్ర నెగి, నిర్మాత: అశోక్‌ కుల్లర్‌.

Updated Date - Jul 03 , 2024 | 03:03 AM