Ninnu Vadalanu: రష్యన్ సింగర్ ప్రధాన పాత్రలో హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్

ABN , Publish Date - Jul 02 , 2024 | 10:13 PM

లియుబా పామ్, కుష్బూ జైన్ ముఖ్య పాత్రల్లో యువీటి హాలీవుడ్ స్టూడియో (యూఎస్ఏ) మరియు శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘నిన్ను వదలను’. అశోక్ కుల్లర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవేంద్ర నెగి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. షిరాజ్ మెహది దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం గోవా, హైదరాబాద్ ప్రాంతాల్లో జరిగే హర్రర్ మరియు సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఉండబోతుందని తాజాగా మేకర్స్ ప్రకటించారు.

Russian Singer Lyuba Palm

లియుబా పామ్ (Lyuba Palm), కుష్బూ జైన్ (Khusbhu Jain) ముఖ్య పాత్రల్లో యువీటి హాలీవుడ్ స్టూడియో (యూఎస్ఏ) మరియు శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘నిన్ను వదలను’ (Ninnu Vadalanu). అశోక్ కుల్లర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవేంద్ర నెగి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గంగాధర్, వైజాగ్ షరీఫ్, వైజాగ్ రవితేజ, అజయ్, అనంత్ ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తోన్న ఈ చిత్రం షిరాజ్ మెహది దర్శకత్వంలో తెరకెక్కుతోంది. గోవా, హైదరాబాద్ ప్రాంతాల్లో జరిగే ఈ సినిమా హర్రర్ మరియు సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఉండబోతుందని తాజాగా మేకర్స్ ప్రకటించారు.


Ninnu-Vadalanu-2.jpg

ఇందులో ఓ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లియుబా పామ్ రష్యాలో పుట్టి పెరిగారు. ఆమె ఒక సింగర్ మరియు ప్రొడ్యూసర్ కూడా కావడం విశేషం. రష్యాలో ‘సేవ్ ద చిల్డ్రన్’ అని ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్‌కి నిర్మాతగా మరియు ‘లవ్ ఓవర్ ఈవిల్’ అనే టీవీ సిరీస్‌కి రైటర్ మరియు నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పుడు స్ట్రైట్ తెలుగులో ‘నిన్ను వదలను’ అనే హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు. (Ninnu Vadalanu Movie Update)

Lyuba-Palm.jpg

Updated Date - Jul 02 , 2024 | 11:46 PM