రుహానీ.. డైనమిక్‌ లుక్‌

ABN , Publish Date - Feb 13 , 2024 | 06:14 AM

వరుణ్‌తేజ్‌ తొలిసారిగా నటిస్తున్న బాలీవుడ్‌ చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో వరుణ్‌తేజ్‌ ఐఎఎఫ్‌ ఆఫీసర్‌గా నటిస్తుండగా, మానుషీ చిల్లర్‌ రాడార్‌ ఆఫీసర్‌గా..

రుహానీ.. డైనమిక్‌ లుక్‌

వరుణ్‌తేజ్‌ తొలిసారిగా నటిస్తున్న బాలీవుడ్‌ చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో వరుణ్‌తేజ్‌ ఐఎఎఫ్‌ ఆఫీసర్‌గా నటిస్తుండగా, మానుషీ చిల్లర్‌ రాడార్‌ ఆఫీసర్‌గా కనిపిస్తారు. ఈ సినిమాకు మరో గ్లామర్‌ రుహానీ శర్మ. ఇందులో ఈమె ఎయిర్‌ ఫోర్స్‌ పైలెట్‌గా నటిస్తున్నారు. పాత్ర పేరు తాన్యా శర్మ. ఆమె లుక్‌ పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు. పైలెట్‌ యూనిఫామ్‌లో ఆమె డైనమిక్‌గా కనిపించారు. దేశంలోని వైమానిక దళ వీరుల అలుపెరుగని పోరాటాన్ని , దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొనే సవాళ్లను అద్భుతంగా ఆవిష్కరించే ఈ చిత్రానికి శక్తి ప్రతాప్‌సింగ్‌ హడ దర్శకుడు. మార్చి ఒకటిన తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌, రినైసన్స్‌ పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.

Updated Date - Feb 13 , 2024 | 06:14 AM