రూ. 8 కోట్లు 12 రోజులు

ABN , Publish Date - May 08 , 2024 | 05:12 AM

నిఖిల్‌ కథానాయకుడిగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘స్వయంభూ’. సంయుక్త, నభానటేశ్‌ కథానాయికలు. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వంలో భువన్‌, శ్రీకర్‌ నిర్మిస్తున్నారు..

రూ. 8 కోట్లు 12 రోజులు

నిఖిల్‌ కథానాయకుడిగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘స్వయంభూ’. సంయుక్త, నభానటేశ్‌ కథానాయికలు. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వంలో భువన్‌, శ్రీకర్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. తాజా షెడ్యూల్‌లో యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రబృందం తెరకెక్కిస్తోంది. 12 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌ కోసం చిత్రబృందం రూ. 8 కోట్లు ఖర్చు చేస్తోంది. రెండు భారీ సెట్స్‌ను రూపొందించారు. వియత్నాంకు చెందిన ఫైటర్లతో పాటు 700 మంది ఆర్టిస్టులు ఈ సీక్వెన్స్‌లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా నిఖిల్‌ బరిలోకి దిగేముందు ఆసక్తిగా జనాలను గమనిస్తున్న లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రానికి రవిబస్రూర్‌ సంగీతం అందిస్తున్నారు.

Updated Date - May 08 , 2024 | 05:12 AM