ఆర్‌ఆర్‌ఆర్‌ ఓ అద్భుతం

ABN , Publish Date - Feb 08 , 2024 | 02:31 AM

హాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ మరోమారు రాజమౌళిని అభినందనలతో ముంచెత్తారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ఓ అద్భుతం అని ప్రశంసించారు. సాటర్న్‌ అవార్డ్స్‌ కార్యక్రమం ఇందుకు వేదికైంది...

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓ అద్భుతం

రాజమౌళిపై కామెరూన్‌ ప్రశంసలు

హాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ మరోమారు రాజమౌళిని అభినందనలతో ముంచెత్తారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ఓ అద్భుతం అని ప్రశంసించారు. సాటర్న్‌ అవార్డ్స్‌ కార్యక్రమం ఇందుకు వేదికైంది. ఓ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు కామెరూన్‌ బదులిస్తూ ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చాలా అద్భుతమైన సినిమా అనిపించింది. ఆ అనుభూతినే రాజమౌళితో పంచుకున్నాను. ప్రపంచం మొత్తం ఆ సినిమాను ఇష్టపడింది. భారతీయ సినిమా ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటడం మంచి పరిణామమని’ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై స్పందించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రబృందం కామెరూన్‌కు ధన్యవాదాలు తెలిపింది. గతేడాది జరిగిన క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డుల కార్యక్రమంలో రాజమౌళి, కామెరూన్‌ కలిశారు. ఆ సందర్భంలో కామెరూన్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అద్భుతంగా ఉందని కొనియాడారు. ప్రస్తుతం మహేశ్‌బాబు కథానాయకుడిగా రాజమౌళి ఓ చిత్రం రూపొందిస్తున్నారు.

Updated Date - Feb 08 , 2024 | 02:31 AM