రౌడీ రిలీజ్‌కు రెడీ

ABN , Publish Date - Jun 12 , 2024 | 03:44 AM

కేజీఎఫ్‌ ఫేమ్‌ యశ్‌ హీరోగా నటించిన ఓ కన్నడ చిత్రం ‘రాజధాని రౌడీ’ పేరుతో తెలుగులో విడుదలవుతోంది. షీనా కథానాయిక. కేవీ రాజు దర్శకుడు. ఈ నెల 14న ఈ చిత్రం...

రౌడీ రిలీజ్‌కు రెడీ

కేజీఎఫ్‌ ఫేమ్‌ యశ్‌ హీరోగా నటించిన ఓ కన్నడ చిత్రం ‘రాజధాని రౌడీ’ పేరుతో తెలుగులో విడుదలవుతోంది. షీనా కథానాయిక. కేవీ రాజు దర్శకుడు. ఈ నెల 14న ఈ చిత్రం విడుదలవుతోంది. సంతోష్‌ ఎంటర్టైన్‌మెంట్స్‌ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత సంతోష్‌ కుమార్‌ మాట్లాడుతూ ‘మాదక ద్రవ్యాలు, మద్యపానం బారినపడిన నలుగురు యువకులు తమ జీవితాలను ఎలా నాశనం చేసుకున్నారు అనే పాయింట్‌ చుట్టూ కథ సాగుతుంది. వినోదానికి చక్కటి సందేశాన్ని జోడించి తెరకెక్కించాం’ అని తెలిపారు. ‘ఈ చిత్రంలో ప్రకాశ్‌ రాజ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కీలకపాత్రలో నటించారు. ముమైత్‌ఖాన్‌ పాత్ర ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉంటుంది’ అని దర్శకుడు అన్నారు.

=

Updated Date - Jun 12 , 2024 | 03:44 AM