రొమాంటిక్‌ సిల్క్‌ శారీ

ABN , Publish Date - May 19 , 2024 | 06:30 AM

వాసుదేవ్‌రావు, రీనా చౌదరి, ప్రీతీ గోస్వామి హీరోహీరోయిన్లుగా నటించిన ‘సిల్క్‌ శారీ’ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శనివారం ప్రసాద్‌ ప్రీవ్యూ థియేటర్‌లో...

రొమాంటిక్‌ సిల్క్‌ శారీ

వాసుదేవ్‌రావు, రీనా చౌదరి, ప్రీతీ గోస్వామి హీరోహీరోయిన్లుగా నటించిన ‘సిల్క్‌ శారీ’ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శనివారం ప్రసాద్‌ ప్రీవ్యూ థియేటర్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు మురళీమోహన్‌, శ్రీకాంత్‌, శివాజీ రాజా, ఉత్తేజ్‌ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రమలేష్‌ కుమార్‌ మాట్లాడుడూ ‘ఒక మంచి సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్నందుకు ఆనందంగా ఉంది. మా బేనరుపై వరుసగా చిత్రాలు నిర్మిస్తాం’ అని చెప్పారు. దర్శకుడు టి.నాగేందర్‌ మాట్లాడుతూ ‘ఇదొక సరికొత్త రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉన్నాయి. హీరో వాసుదేవ్‌రావు కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రమవుతుంది’ అని చెప్పారు.

Updated Date - May 19 , 2024 | 06:30 AM