కమల్‌ చిత్రంలో రోహిత్‌

ABN , Publish Date - Jun 27 , 2024 | 12:22 AM

విశిష్ట నటుడు కమల్‌హాసన్‌, దర్శకుడు మణిరత్నం చాలా కాలం తర్వాత మళ్లీ కలసి పనిచేస్తున్న ‘థగ్‌ లైఫ్‌’ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు రోహిత్‌ సరాఫ్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. అటు కమల్‌ను, ఇటు మణిరత్నంను అభిమానించే...

కమల్‌ చిత్రంలో రోహిత్‌

విశిష్ట నటుడు కమల్‌హాసన్‌, దర్శకుడు మణిరత్నం చాలా కాలం తర్వాత మళ్లీ కలసి పనిచేస్తున్న ‘థగ్‌ లైఫ్‌’ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు రోహిత్‌ సరాఫ్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. అటు కమల్‌ను, ఇటు మణిరత్నంను అభిమానించే రోహిత్‌ను వెదుక్కుంటూ ఈ అవకాశం రావడంతో మరో మాట మాట్లాడకుండా ఒప్పేసుకున్నారు. ప్రస్తుతం అతనిపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘ఈ సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంతో జరుగుతోంది. ఆగస్టుకు సినిమాను పూర్తి చేయాలనే సంకల్పంతో మణిరత్నం పని చేస్తున్నారు. డిసెంబర్‌లో సినిమా విడుదలవుతుంది’ అని యూనిట్‌ వర్గాలు చెప్పాయి. కమల్‌హాసన్‌, శింబు, త్రిష, నాజర్‌, జోజు జార్జ్‌, రోహిత్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Updated Date - Jun 27 , 2024 | 12:22 AM