దీపావళికి రాకీ రాక

ABN , Publish Date - Jul 19 , 2024 | 02:03 AM

విష్వక్‌సేన్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మెకానిక్‌ రాకీ’. కామెడీ, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంతో రవితేజ ముళ్లపూడి దర్శకుడిగా...

విష్వక్‌సేన్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మెకానిక్‌ రాకీ’. కామెడీ, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంతో రవితేజ ముళ్లపూడి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌పై రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో విష్వక్‌ సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం విడుదల తేదీని మేకర్స్‌ ఖరారు చేశారు. దీపావళి సందర్భంగా అక్టోబర్‌ 31న ‘మెకానిక్‌ రాకీ’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌లో విష్వక్‌సేన్‌ గన్‌, రెంచ్‌ పట్టుకొని గంభీరమైన లుక్‌లో కనిపించారు. వైవా హర్ష, హర్షవర్ధన్‌ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి జేక్స్‌ బిజోయ్‌ సంగీతం అందిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు: సత్యం రాజేశ్‌, విద్యాసాగర్‌ జె, సినిమాటోగ్రపీ: మనోజ్‌ కటసాని, ఎడిటర్‌: అన్వర్‌ అలీ

Updated Date - Jul 19 , 2024 | 02:03 AM