ఈ క్రిస్మస్‌ మాదే!

ABN , Publish Date - Nov 28 , 2024 | 06:02 AM

‘భీష్మ’ చిత్రం తర్వాత దర్శకుడు వెంకీతో చేస్తున్న సినిమా ‘రాబిన్‌హుడ్‌’. నా కెరీర్‌లోనే ఇది హయ్యెస్ట్‌ బడ్జెట్‌ సినిమా. ‘భీష్మ’ మ్యాజిక్‌ రిపీట్‌ అవుతుందని స్ట్రాంగ్‌గా నమ్ముతున్నా.

‘భీష్మ’ చిత్రం తర్వాత దర్శకుడు వెంకీతో చేస్తున్న సినిమా ‘రాబిన్‌హుడ్‌’. నా కెరీర్‌లోనే ఇది హయ్యెస్ట్‌ బడ్జెట్‌ సినిమా. ‘భీష్మ’ మ్యాజిక్‌ రిపీట్‌ అవుతుందని స్ట్రాంగ్‌గా నమ్ముతున్నా. శ్రీలీలతో నాకు ఇది సెకండ్‌ ఫిల్మ్‌. మాది హిట్‌ పెయిర్‌ అని ఈ సినిమా తర్వాత అనిపించుకుంటాం. నిర్మాతలు పెట్టిన డబ్బుని రాబిన్‌హుడ్‌ రెట్టింపు మొత్తంలో మీ నుంచి దోచుకుని వారికి ఇస్తాడు. గ్యారంటీగా చెబుతున్నా ఈ క్రిస్మస్‌ మాదే’ అన్నారు హీరో నితిన్‌. ఆయన హీరోగా నటించిన ‘రాబిన్‌హుడ్‌’ చిత్రం వచ్చే నెల 25న విడుదలవుతున్న సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. హీరోయిన్‌ శ్రీలీల మాట్లాడుతూ ‘ఇప్పటివరకూ నన్ను కమర్షియల్‌ హీరోయిన్‌గా, డాన్సింగ్‌ స్పెషల్‌గా ఆడియన్స్‌ చూశారు. ‘రాబిన్‌హుడ్‌’తో నా నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు’ అని చెప్పారు. చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ ‘నన్ను , కథని నమ్మి ఇంత బడ్జెట్‌ పెట్టి సినిమా తీసిన నిర్మాతలకు కృతజ్ఞతలు. సపోర్ట్‌ చేసిన నితిన్‌కు థాంక్స్‌. ఎడిటింగ్‌ రూమ్‌లో సినిమా చూసుకున్నా. చాలా కాన్పిడెంట్‌గా ఉన్నా. నిర్మాతలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇందులో ఓ ఐటెం సాంగ్‌ ఉంది. అది కూడా ట్రంప్‌ కార్డ్‌ అవుతుంది’ అని చెప్పారు. నిర్మాతలు నవీన్‌, రవిశంకర్‌ మాట్లాడుతూ ‘సినిమా చాలా బాగా వచ్చింది. మీ అందరికీ నచ్చుతుందని మా నమ్మకం’ అన్నారు.

Updated Date - Nov 28 , 2024 | 06:02 AM