రాబిన్‌హుడ్‌ డ్యూయెట్‌

ABN , Publish Date - Nov 27 , 2024 | 06:23 AM

నితిన్‌, శ్రీలీల హీరో హీరోయిన్లుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాబిన్‌హుడ్‌’. మైత్రీ మూవీ మేకర్స్‌ బేనర్‌పై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు...

నితిన్‌, శ్రీలీల హీరో హీరోయిన్లుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాబిన్‌హుడ్‌’. మైత్రీ మూవీ మేకర్స్‌ బేనర్‌పై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. జి.వి.ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం సమకూర్చారు. డిసెంబరు 25న గ్రాండ్‌ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్‌ ఫస్ట్‌ సింగిల్‌-‘వన్‌ మోర్‌ టైమ్‌’ని రిలీజ్‌ చేశారు. ప్రేమ కోసం తన గర్ల్‌ ఫ్రెండ్‌తో మరో అవకాశం కోరే హీరో గురించిన సాంగ్‌ ఇది. అద్భుతమైన లోకేషన్లలో చిత్రీకరించిన ఈ పాటకు కృష్ణకాంత్‌ యూత్‌ఫుల్‌ లిరిక్స్‌ రాశారు. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, వెన్నెల కిశోర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Updated Date - Nov 27 , 2024 | 06:23 AM