సందీప్‌ సరసన రీతూ

ABN , Publish Date - Oct 27 , 2024 | 05:53 AM

త్రినాధరావు దర్శకత్వంలో రాజేష్‌ దండా నిర్మిస్తున్న చిత్రం ‘మజాకా’. సందీప్‌ కిషన్‌ హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ వైజాగ్‌లో జరుగుతోంది. 20 రోజుల లెన్తీ షెడ్యూల్‌లో యాక్షన్‌ బ్లాక్స్‌తోపాటు ప్రధాన తారాగణంపై...

త్రినాధరావు దర్శకత్వంలో రాజేష్‌ దండా నిర్మిస్తున్న చిత్రం ‘మజాకా’. సందీప్‌ కిషన్‌ హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ వైజాగ్‌లో జరుగుతోంది. 20 రోజుల లెన్తీ షెడ్యూల్‌లో యాక్షన్‌ బ్లాక్స్‌తోపాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కాగా, మేకర్స్‌ ఇంట్రస్టింగ్‌ అప్డేట్‌ ఇచ్చారు. ఈ చిత్రంలో సందీప్‌ కిషన్‌ సరసన రీతూ వర్మ నటిస్తున్నారు. సందీప్‌ కిషన్‌- రీతూ వర్మ హ్యూమరస్‌ అనౌన్స్‌మెంట్‌ వీడియో ఆకట్టుకుంటోంది. ఇందులో రీతూ వర్మ పెళ్లి దుస్తుల్లో అందంగా కనిపించారు.

Updated Date - Oct 27 , 2024 | 05:53 AM