scorecardresearch

Revind: సైంటిఫిక్‌ లవ్‌జానర్‌లో 'రివైండ్‌'

ABN , Publish Date - Oct 06 , 2024 | 07:29 PM

సాయిరోనక్‌ (Sai Ronak), అమృత చౌదరి (Amruth Chowdary)హీరో హీరోయిన్లుగా క్రాస్‌ వైర్‌ క్రియేషన్స్‌పై కళ్యాణ్‌ చక్రవర్తి దర్శకనిర్మాతగా రూపొందుతున్న చిత్రం 'రివైండ్‌’

Revind: సైంటిఫిక్‌ లవ్‌జానర్‌లో 'రివైండ్‌'

సాయిరోనక్‌ (Sai Ronak), అమృత చౌదరి (Amruth Chowdary)హీరో హీరోయిన్లుగా క్రాస్‌ వైర్‌ క్రియేషన్స్‌పై కళ్యాణ్‌ చక్రవర్తి దర్శకనిర్మాతగా రూపొందుతున్న చిత్రం 'రివైండ్‌’ (Revind). ఇటీవల విడుదల చేసిన టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ నెల 18న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
సాయి రోనక్‌ మాట్లాడుతూ "చిన్న టీమ్‌ ఈ సినిమాకు పని చేసి ఉండొచ్చు కానీ మంచి సబ్జెక్ట్‌తో చేశాం.  మాకున్న బడ్జెట్‌, లైన్‌అప్‌తో ఎక్కడ కాంప్రమైజ్‌ అవ్వకుండా తీశాం. ఈనెల 18న ఈ సినిమాను విడుదల చేయబోతున్నాం’’ అని అన్నారు.
దర్శకనిర్మాత కళ్యాణ్‌ చక్రవర్తి మాట్లాడుతూ  "టైం ట్రావెల్‌ మీద తీసిన లవ్‌, సైఫై జోనర్‌ సినిమా ఇది. ఆ తరహా చిత్రాలకు మంచి ఆదరణ ఉంటుంది. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ప్రేమ కథకు తగ్గట్టు పాటలు కుదిరాయి’’ అని అన్నారు. 

Updated Date - Oct 06 , 2024 | 07:29 PM