ప్రజల ముందుకు ప్రతినిధి

ABN , Publish Date - May 06 , 2024 | 02:10 AM

పదేళ్ల క్రితం విడుదలై సంచలన విజయం సాధించిన ‘ప్రతినిధి’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం ‘ప్రతినిధి 2’. నారా రోహిత్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి...

ప్రజల ముందుకు ప్రతినిధి

పదేళ్ల క్రితం విడుదలై సంచలన విజయం సాధించిన ‘ప్రతినిధి’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం ‘ప్రతినిధి 2’. నారా రోహిత్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించారు. కుమార్‌రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీతో, సురేంద్రనాథ్‌ బొల్లినేని నిర్మించారు. ఈ నెల 10న ఈ చిత్రం విడుదలవుతోందని మేకర్స్‌ ప్రకటించారు. ఇందులో నిజాయితీ గల న్యూస్‌ రిపోర్టర్‌ పాత్రలో నారా రోహిత్‌ కనిపించనున్నారు. సరీ లెల్లా కథానాయికగా నటిస్తుండగా, తనికెళ్ల భరణి, ప్రవీణ్‌, అజయ్‌ ఘోష్‌, పృథ్వీరాజ్‌, రఘుబాబు, దినేశ్‌ తేజ్‌, సప్తగిరి, ఇంద్రజ, ఉదయభాను కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: రవితేజ గిరజాల, డీఓపీ: నాని చమిడిశెట్టి, సంగీతం: మహతి స్వరసాగర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కార్తీక్‌ పుప్పాల.

Updated Date - May 06 , 2024 | 02:10 AM