రెమ్యూనరేషన్‌ రెట్టింపు?

ABN , Publish Date - Mar 21 , 2024 | 05:53 AM

‘డాన్‌ 3’ చిత్రంలో రణ్‌ వీర్‌సింగ్‌ సరసన కియారా అద్వాణీ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్‌లో బాగా డిమాండ్‌ ఉన్న కథానాయికల్లో ఆమె ఒకరు. ఈ సినిమా కోసం కియారా ఏకంగా రూ. 13 కోట్లు పారితోషికంగా...

రెమ్యూనరేషన్‌ రెట్టింపు?

‘డాన్‌ 3’ చిత్రంలో రణ్‌ వీర్‌సింగ్‌ సరసన కియారా అద్వాణీ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్‌లో బాగా డిమాండ్‌ ఉన్న కథానాయికల్లో ఆమె ఒకరు. ఈ సినిమా కోసం కియారా ఏకంగా రూ. 13 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నట్లు బీ టౌన్‌ టాక్‌. ఇప్పటివరకూ కియారా అందుకున్న అత్యధిక పారితోషికం కూడా ఇదేనట. అంతేకాదు హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ నటిస్తున్న మల్టీ స్టారర్‌ చిత్రంలోనూ ఆమె కథానాయికగా నటిస్తున్నారు. అయితే ఆ సినిమాకు మాత్రం ఆమె రూ. 6 కోట్లు తీసుకుంటున్నారట. ఆ చొప్పున ‘డాన్‌ 3’ కు ఆమె రెట్టింపు పారితోషికం అందుకుంటున్నట్లే లెక్క. ఈ చిత్రంలో ఇప్పటివరకూ కనిపించని కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నట్లు కియారా గతంలో చెప్పారు.

Updated Date - Mar 21 , 2024 | 05:53 AM