స్కూల్ లైఫ్‌ను గుర్తుకు తెచ్చేలా
ABN , Publish Date - Aug 05 , 2024 | 06:17 AM
ప్రియదర్శి, విశ్వదేవ్, భాగ్యరాజ్, నివేత థామస్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘35 చిన్న కథ కాదు’. నంద కిషోర్ ఈమాని దర్శకత్వంలో...
ప్రియదర్శి, విశ్వదేవ్, భాగ్యరాజ్, నివేత థామస్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘35 చిన్న కథ కాదు’. నంద కిషోర్ ఈమాని దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు. ఈ నెల 15న సినిమా విడుదలవుతోంది. ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘సయ్యారే సయ్యా’ పాటను విడుదల చేశారు. అందరికీ స్కూల్ లైఫ్ జ్ఞాపకాలను, బాల్య స్నేహాలను గుర్తుకు తెచ్చేలా సాగిందీ పాట. కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించగా, కార్తీక్ ఆలపించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి ఎడిటర్: టి.సి.ప్రసన్న, డీఓపీ: నికేత్ బొమ్మ.