జైలు నుంచి విడుదల

ABN , Publish Date - Oct 26 , 2024 | 05:53 AM

చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న కొరియోగ్రాఫర్‌ జానీమాస్టర్‌ శుక్రవారం బెయిల్‌పై విడుదలయ్యారు. ఆయనకు గురువారం హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. బెయిల్‌ పత్రాలు శుక్రవారం సాయంత్రం

సైదాబాద్‌, (ఆంధ్రజ్యోతి) : చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న కొరియోగ్రాఫర్‌ జానీమాస్టర్‌ శుక్రవారం బెయిల్‌పై విడుదలయ్యారు. ఆయనకు గురువారం హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. బెయిల్‌ పత్రాలు శుక్రవారం సాయంత్రం జైలుకు చేరడంతో విడుదలయ్యారు. జైలు వద్ద మీడియాతో మాట్లాడకుండా భార్యతో కలిసి వాహనంలో అభివాదం చేసుకుంటూ వెళ్లిపోయారు. లైంగిక వేధింపుల ఆరోపణలతో మహిళా కొరియోగ్రాఫర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగ్‌ పోలీసులు జానీ మాస్టర్‌పై కేసు నమోదు చేసి సెప్టెంబరు 20న రిమాండ్‌కు తరలించారు. కేసు నేపథ్యంలో జానీమాస్టర్‌కు 2022 సంవత్సరానికి ఇచ్చిన జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్‌ పురస్కారం నిలిపివేశారు.

Updated Date - Oct 26 , 2024 | 05:53 AM