రిలీజ్ డేట్ ఫిక్స్
ABN , Publish Date - Nov 04 , 2024 | 05:34 AM
లక్ష్మీ రాయ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఝాన్సీ ఐపీఎస్’. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం ఈనెల 22న తెలుగులో విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ ...
లక్ష్మీ రాయ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఝాన్సీ ఐపీఎస్’. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం ఈనెల 22న తెలుగులో విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ ‘లక్ష్మీరాయ్ త్రిపాత్రాభినయం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఫైట్ మాస్టర్ థ్రిల్లర్ మంజు కంపోజ్ చేసిన ఎనిమిది ఫైట్లు హైలెట్‌గా నిలుస్తాయి. లక్ష్మీరాయ్ చేసిన మూడు క్యారెక్టర్స్ డిఫరెంట్ షేడ్స్‌లో ఉంటాయి’ అని అన్నారు. నటి ఆక్షఖాన్ మాట్లాడుతూ ‘గతంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు ఎన్నో వచ్చాయి. కాని లక్ష్మీరాయ్ నటించిన ఈ చిత్రానికి ప్రత్యేకత ఉంది’ అని చెప్పారు. నటుడు జె.వి.ఆర్ మాట్లాడుతూ ‘మంచి పబ్లిసిటీతో, అత్యధిక థియేటర్లలో రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.