మత్స్యకారుల జీవితాలను ప్రతిబింబించేలా...
ABN , Publish Date - Oct 22 , 2024 | 02:12 AM
రమాకాంత్, అవంతిక, భానుశ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సముద్రుడు’. నగేశ్ నారదాసి దర్శకత్వంలో బధావత్ కిషన్ నిర్మించారు...
రమాకాంత్, అవంతిక, భానుశ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సముద్రుడు’. నగేశ్ నారదాసి దర్శకత్వంలో బధావత్ కిషన్ నిర్మించారు. ఈ నెల 25న సినిమా విడుదలవుతోన్న సందర్భంగా చిత్రబృందం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో నిర్మాత బధావత్ కిషన్ మాట్లాడుతూ ‘‘మత్స్యకారుల జీవితాలను ప్రతిబింబించేలా ఉండే చిత్రమిది. ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలున్న మంచి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా ఇది’’ అని అన్నారు.