ఎర్ర గులాబీ

ABN , Publish Date - Jun 18 , 2024 | 03:37 AM

మలయాళ నటి హనీ రోజ్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తున్న ‘రేచల్‌’ చిత్రం టీజర్‌ విడుదలైంది. వయలెన్స్‌, బ్లడ్‌ షెడ్‌ కలిగిన కథాంశమని ఈ టీజర్‌ చూడగానే అర్థమవుతుంది...

ఎర్ర గులాబీ

మలయాళ నటి హనీ రోజ్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తున్న ‘రేచల్‌’ చిత్రం టీజర్‌ విడుదలైంది. వయలెన్స్‌, బ్లడ్‌ షెడ్‌ కలిగిన కథాంశమని ఈ టీజర్‌ చూడగానే అర్థమవుతుంది. నటిగా హనీ రోజ్‌కు ఉన్న అనుభవం, నైపుణ్యాన్ని ఈ సినిమా ఉపయోగించుకుంటోందనే విషయాన్ని ఈ టీజర్‌ వెల్లడించింది. నూతన దర్శకురాలు ఆనందిని బాలాను పరిచయం చేస్తూ బాదుషా ఎన్‌.ఎం, రాజన్‌ చిరాయిల్‌ నిర్మిస్తున్నారు. దర్శకుడు అబ్రిడ్‌ షైన్‌ ఈ సినిమాకు సహ నిర్మాత. మలయాళంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. రాహుల్‌ మణప్పట్టు కథ అందించిన ఈ చిత్రానికి ఆయనతో పాటు అబ్రిడ్‌ షైన్‌ కూడా స్ర్కీన్‌ప్లే తయారు చేశారు.

Updated Date - Jun 18 , 2024 | 12:49 PM