రెడీ అయిన రాయన్‌

ABN , Publish Date - Jul 11 , 2024 | 04:45 AM

ప్రతి హీరో కెరీర్‌లో 50, 100 చిత్రాలకు ఓ ప్రత్యేకత ఎప్పుడూ ఉంటుంది. ప్రత్యేక కథలతో ఈ చిత్రాల్లో నటించడానికి హీరోలు ప్లాన్‌ చేసుకుంటుంటారు. తమిళ హీరో ధనుష్‌ తన 50వ చిత్రం ‘రాయన్‌’ కోసం..

ప్రతి హీరో కెరీర్‌లో 50, 100 చిత్రాలకు ఓ ప్రత్యేకత ఎప్పుడూ ఉంటుంది. ప్రత్యేక కథలతో ఈ చిత్రాల్లో నటించడానికి హీరోలు ప్లాన్‌ చేసుకుంటుంటారు. తమిళ హీరో ధనుష్‌ తన 50వ చిత్రం ‘రాయన్‌’ కోసం ఓ మంచి కథను ఎంపక చేయడమే కాకుండా తనే ఆ చిత్రానికి దర్శకత్వం వహించారు. సందీప్‌ కిషన్‌, కాళిదాస్‌ జయరామ్‌ కీలక పాత్రలు పోషించారు. సెన్సార్‌తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ‘రాయన్‌’ చత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 26న సినిమా రిలీజ్‌ కానుంది. ఏషియన్‌ సురేశ్‌ సంస్థలు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వెర్షన్‌ను విడుదల చేస్తున్నాయి. అపర్ణ బాలమురుగన్‌, ఎస్‌.జె.సూర్య, సెల్వ రాఘవన్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఏ.ఆర్‌.రెహమాన్‌ సంగీత దర్శకత్వం వహించారు.

Updated Date - Jul 11 , 2024 | 04:45 AM