సిద్ధమైన హనీ-బన్నీ

ABN , Publish Date - Mar 20 , 2024 | 06:14 AM

హాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌ ‘సిటాడెల్‌’ ఇండియన్‌ వెర్షన్‌లో సమంత, వరుణ్‌ ధావన్‌ జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్‌ వెర్షన్‌కు రుస్సో బ్రదర్స్‌ దర్శకత్వం వహించగా, ‘ఫ్యామిలీమ్యాన్‌’ సిరీస్‌తో పాపులర్‌...

సిద్ధమైన హనీ-బన్నీ

హాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌ ‘సిటాడెల్‌’ ఇండియన్‌ వెర్షన్‌లో సమంత, వరుణ్‌ ధావన్‌ జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్‌ వెర్షన్‌కు రుస్సో బ్రదర్స్‌ దర్శకత్వం వహించగా, ‘ఫ్యామిలీమ్యాన్‌’ సిరీస్‌తో పాపులర్‌ అయిన దర్శక ద్వయం రాజ్‌, డీకే ఇండియన్‌ వెర్షన్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్‌ చిత్రీకరణ పూర్తయినా, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్‌ అవుతుందనే విషయంలో ఇంతవరకూ ఎటువంటి అప్‌డేట్‌ రాలేదు. మేకర్స్‌ మంగళవారం ఈ సిరీస్‌ పోస్టర్‌తో పాటు టైటిల్‌ను రివీల్‌ చేశారు. ‘హనీ-బన్నీ’ పేరుని ఖరారు చేశారు. ఈ సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవనుంది. డేట్‌ మాత్రం ఇంకా ఫిక్స్‌ చేయలేదు. 1990ల నేపథ్యంలో సాగనున్న ఈ సిరీస్‌ అద్భుతమైన ప్రేమ కథతో కూడిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌. దర్శక ద్వయం రాజ్‌, డీకే రూపొందించిన ‘ఫ్యామిలీమ్యాన్‌’ సిరీస్‌లో నెగెటివ్‌ టచ్‌ ఉన్న పాత్రను పోషించిన సమంత ‘హనీ-బన్నీ సిరీస్‌కోసం మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ పొందారు. ఈ సిరీస్‌లో కేకే మీనన్‌, సిమ్రాన్‌, సోహమ్‌ మజుందార్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Updated Date - Mar 20 , 2024 | 06:14 AM