వార్‌కు రెడీ

ABN , Publish Date - Apr 12 , 2024 | 05:36 AM

జూనియర్‌ ఎన్టీఆర్‌ ‘వార్‌ 2’ సెట్స్‌లోకి అడుగుపెట్టారు. గురువారం ముంబైలో ఆయన తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు...

వార్‌కు రెడీ

జూనియర్‌ ఎన్టీఆర్‌ ‘వార్‌ 2’ సెట్స్‌లోకి అడుగుపెట్టారు. గురువారం ముంబైలో ఆయన తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

ఇందులో ఎన్టీఆర్‌ గూఢచారి పాత్రలో కనిపించనున్నారు. హీరోగా ఆయనకు ఇది తొలి హిందీ చిత్రం. వచ్చే ఏడాది ఆగస్టు 15న ‘వార్‌ 2’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘వార్‌’కు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో హృతిక్‌రోషన్‌ మరో హీరోగా నటిస్తున్నారు. కియారా అద్వాణీ కథానాయిక. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తోంది.

Updated Date - Apr 12 , 2024 | 05:36 AM