రీ రిలీజ్‌కు రెడీ...

ABN , Publish Date - Mar 13 , 2024 | 03:34 AM

ప్రభుదేవా కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వం వహించిన ‘ప్రేమికుడు’ చిత్రం అప్పట్లో సంచలన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. 1994లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో కుర్రకారును ఓ ఊపు ఊపింది...

రీ రిలీజ్‌కు రెడీ...

ప్రభుదేవా కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వం వహించిన ‘ప్రేమికుడు’ చిత్రం అప్పట్లో సంచలన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. 1994లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో కుర్రకారును ఓ ఊపు ఊపింది. తమిళంలో క్లాసిక్‌గా నిలిచి, తెలుగులోనూ సూపర్‌హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా, యువతీయువకులను ఈ చిత్రం విపరీతంగా ఆకట్టుకుంది. ఏ. ఆర్‌. రెహమాన్‌ స్వరపరిచిన ‘అందమైన ప్రేమరాణి, ‘ఊర్వశీ ఊర్వశీ’, ‘ఓ చెలియా నా ప్రియ సఖియా’, ‘ముక్కాల ముక్కాబులా’ గీతాలు మ్యూజికల్‌ సెన్షేషన్‌ సృష్టించాయి. అప్పటి కుర్రకారు మదిని దోచేసిన ‘ప్రేమికుడు’, ఈ తరాన్ని కూడా అంతలానే అలరిస్తుందన్న నమ్మకంతో రీ రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం రీ రిలీజ్‌ రైట్స్‌ను మురళీధర్‌ రెడ్డి, రమణ దక్కించుకున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని వారు తెలిపారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత రీ రిలీజ్‌ కానున్న ఈ చిత్రం ఒకే సారి ఆ తరాన్ని. ఈ తరాన్ని థియేటర్లలో ఆకట్టుకోనుంది.

Updated Date - Mar 13 , 2024 | 03:34 AM