ఒక పథకం ప్రకారం విడుదలకు సిధ్ధం

ABN , Publish Date - Feb 20 , 2024 | 05:19 AM

సాయిరామ్‌ శంకర్‌, అసీమా నర్వాల్‌ , శ్రుతీ సోధీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. వినోద్‌ విజయన్‌ దర్శకత్వం వహిస్తూ, గార్లపాటి రమేశ్‌తో కలసి...

ఒక పథకం ప్రకారం విడుదలకు సిధ్ధం

సాయిరామ్‌ శంకర్‌, అసీమా నర్వాల్‌ , శ్రుతీ సోధీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. వినోద్‌ విజయన్‌ దర్శకత్వం వహిస్తూ, గార్లపాటి రమేశ్‌తో కలసి నిర్మిస్తున్నారు. సాయిరామ్‌ శంకర్‌ పవర్‌ఫుల్‌ అడ్వకేట్‌ పాత్ర పోషించారు. సముద్రఖని పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని మార్చిలో విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం సోమవారం ప్రకటించింది. ఈ సందర్భంగా వినోద్‌ విజయన్‌ మాట్లాడుతూ ‘ఇదొక విభిన్నమైన థ్రిల్లర్‌. గోపిసుందర్‌ నేపథ ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ. సిధ్‌ శ్రీరాం పాడిన పాటలకు ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన లభిస్తోంది’ అన్నారు. భానుశ్రీ, పల్లవి గౌడ్‌ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాజీవ్‌ రవి.

Updated Date - Feb 20 , 2024 | 05:19 AM