రిలీజ్‌కు రెడీగా తిరగబడరా సామి

ABN , Publish Date - Jan 09 , 2024 | 04:01 AM

రాజ్‌తరుణ్‌ హీరోగా ఏఎస్‌ రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘తిరగబడరా సామి’. మాల్వీ మల్హోత్రా కథానాయిక. మల్కాపురం శివకుమార్‌ నిర్మాత...

రిలీజ్‌కు రెడీగా తిరగబడరా సామి

రాజ్‌తరుణ్‌ హీరోగా ఏఎస్‌ రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘తిరగబడరా సామి’. మాల్వీ మల్హోత్రా కథానాయిక. మల్కాపురం శివకుమార్‌ నిర్మాత. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయినట్లు యూనిట్‌ తెలిపింది. సెంటిమెంట్‌, రొమాన్స్‌, యాక్షన్‌ అంశాలతో రూపొందించామనీ, ఫిబ్రవరి మొదటివారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామనీ మేకర్స్‌ తెలిపారు. మకరంద్‌ దేశ్‌పాండే, జాన్‌ విజయ్‌, రఘు బాబు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జెబి సంగీతం అందించారు. సినిమాటోగ్రఫీ: జవహర్‌రెడ్డి ఎంఎన్‌.

Updated Date - Jan 09 , 2024 | 04:01 AM