ఎలాంటి సాయానికైనా సిధ్దం

ABN , Publish Date - Apr 11 , 2024 | 04:48 AM

నటి అంజలి నటించిన 50వ చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. శివ తుర్లపాటి దర్శకత్వం వహించారు. రచయిత కోనవెంకట్‌, ఎంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా నిర్మించారు...

ఎలాంటి సాయానికైనా సిధ్దం

నటి అంజలి నటించిన 50వ చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. శివ తుర్లపాటి దర్శకత్వం వహించారు. రచయిత కోనవెంకట్‌, ఎంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. మంగళవారం సాయంత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన డిప్యూటి సీఎం మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ ‘‘మధ్య తరగతి వాళ్లని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేదే సినిమా. ప్రభుత్వపరంగా ఇండస్ట్రీకి ఎలాంటి సాయం కావాలన్నా చేసేందుకు సిద్ధం’’ అని చెప్పారు. దర్శకుడు శివ తుర్లపాటి మాట్లాడుతూ ‘‘ఈ మూవీలో ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ను అస్సలు మిస్‌ అవ్వద్దు’’ అని అన్నారు. నిర్మాత కోనవెంకట్‌ మాట్లాడుతూ ‘‘గీతాంజలి చిన్న కాన్సె్‌ప్టతో తీశాం. పెద్ద హిట్‌ అయ్యింది. సీక్వెల్‌ కూడా సూపర్‌ సక్సెస్‌ సాధిస్తుంది’’ అని ధీమా వ్యక్తం చేశారు. హీరోయిన్‌ అంజలి మాట్లాడుతూ ‘‘మొదటి భాగం కంటే రెండో భాగం మరింత ఎంటర్టైన్‌ చేస్తుంది’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో రచయిత విజయేంద్రప్రసాద్‌, సిద్ధు జొన్నలగడ్డ, డైరెక్టర్స్‌ వశిష్ఠ, నందినిరెడ్డి, హేమంత్‌ మధుకర్‌, నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2024 | 04:49 AM