వారి సహకారంతోనే ఈ స్థాయికి చేరుకున్నా

ABN , Publish Date - Jan 21 , 2024 | 02:05 AM

తెలుగు సినిమాకి ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ రెండు కళ్లు లాంటి వారని, వారి సహకారంతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ 28వ పుణ్యతిథి, ఏయన్నార్‌ శత జయంతి కార్యక్రమం...

వారి సహకారంతోనే ఈ స్థాయికి చేరుకున్నా

తెలుగు సినిమాకి ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ రెండు కళ్లు లాంటి వారని, వారి సహకారంతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ 28వ పుణ్యతిథి, ఏయన్నార్‌ శత జయంతి కార్యక్రమం విశాఖపట్నంలో శనివారం నిర్వహించారు. ఇదే వేదికపై ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌కు లోక్‌నాయక్‌ సాహిత్య పురస్కారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ.. శ్రమిస్తే ఎవరైనా పైకి రావచ్చునని నిరూపించిన గొప్ప వ్యక్తులు ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ అని, స్థలాలు కొంటే భవిష్యత్తులో అవే ఉపయోగపడతాయని ఎన్టీఆర్‌ సూచించారని, ఆయన చెప్పినట్టుగానే తన కుటుంబానికి అవి భరోసా కల్పిస్తున్నాయని తెలిపారు. ఏయన్నార్‌ తన బలహీనతలను బలంగా చేసుకుని నటించేవారని, అవే ఆయనకు ఎనలేని కీర్తిని తీసుకువచ్చాయని పేర్కొన్నారు... ఇంకా యండమూరి వీరేంద్రనాథ్‌ కూడా మాట్లాడారు. కార్యక్రమంలో ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం, (ఆంధ్రజ్యోతి)

Updated Date - Jan 21 , 2024 | 02:05 AM