Razakar : భావితరాల భవిష్యత్తు కోసం...

ABN , Publish Date - Mar 24 , 2024 | 02:55 AM

నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌ బాబీ సింహా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రజాకార్‌’. రాజ్‌ అర్జున్‌, మకరంద్‌ దేశ్‌ పాండే, ప్రేమ, ఇంద్రజ, అనసూయ భరద్వాజ్‌, వేదిక కీలక పాత్రల్లో నటించారు. యాటా సత్యనారాయణ దర్శకత్వంలో...

Razakar : భావితరాల భవిష్యత్తు కోసం...

నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌ బాబీ సింహా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రజాకార్‌’. రాజ్‌ అర్జున్‌, మకరంద్‌ దేశ్‌ పాండే, ప్రేమ, ఇంద్రజ, అనసూయ భరద్వాజ్‌, వేదిక కీలక పాత్రల్లో నటించారు. యాటా సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదలైంది. శనివారం చిత్ర యూనిట్‌ ‘హిస్టారికల్‌ హిట్‌’ పేరిట సక్సెస్‌ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినస్టార్‌ రైటర్‌ విజయేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘ నేను తీసిన ‘రాజన్న’ సినిమాలో రజాకార్ల తాలూకు విషయాన్ని టచ్‌ చేశాను. ఈ సబ్జెక్ట్‌పై ఎవరైనా పూర్తి స్థాయి సినిమా చేస్తే బావుంటుందని అనుకున్నాను. గూడూరు నారాయణరెడ్డి నా ఆలోచనను నిజం చేశారు. ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావడం ఎంతో ఆనందంగా ఉంది’’ అని అన్నారు. నిర్మాత గూడూరు నారాయణరెడ్డి మాట్లాడుతూ ‘‘భావితరాల భవిష్యత్తు కోసం తీసిన సినిమా ఇది. డబ్బు కోసం, గ్లామర్‌ కోసం తీయలేదు’’ అని చెప్పారు. దర్శకుడు యాటా సత్యనారాయణ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాకు సంబంధించిన వారందరూ ప్రాణం పెట్టి పని చేశారు. ఈ సినిమాకు నేను పడిన కష్టం కంటే వారు పడిన కష్టమే ఎక్కువ’’ అని అన్నారు. నటి ఇంద్రజ మాట్లాడుతూ ‘‘చాకలి ఐలమ్మగా నా కెరీర్‌లోనే ఉత్తమ పాత్ర పోషించాను’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొంది.

Updated Date - Mar 24 , 2024 | 02:59 AM