రాయన్‌ రాక ఖాయం

ABN , Publish Date - Jun 12 , 2024 | 03:48 AM

హీరో ఇమేజ్‌ను పక్కనపెట్టి ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఇమిడిపోయే నటనా చాతుర్యం ధనుశ్‌ సొంతం. తమిళ చిత్రాలతో మొదలైన ఆయన నట ప్రస్థానం హాలీవుడ్‌ దాకా చేరింది...

రాయన్‌ రాక ఖాయం

హీరో ఇమేజ్‌ను పక్కనపెట్టి ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఇమిడిపోయే నటనా చాతుర్యం ధనుశ్‌ సొంతం. తమిళ చిత్రాలతో మొదలైన ఆయన నట ప్రస్థానం హాలీవుడ్‌ దాకా చేరింది. కోట్లాది మంది అభిమానుల ఆదరణ సొంతం చేసుకుంది. ‘ఇంత సాధించాం ఇక చాల్లే’ అనుకోకుండా, ఎప్పటికప్పుడు కొత్త కథలు, విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన త్వరలో తన 50వ చిత్రం ‘రాయన్‌’తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమాను ధనుశ్‌ స్వీయ దర్శకత్వంలో తెరకె క్కిస్తున్నారు. సందీప్‌ కిషన్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. సన్‌పిక్చర్స్‌ నిర్మిస్తోంది. మేకర్స్‌ మంగళవారం రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. జూలై 26న ‘రాయన్‌’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఏషియన్‌ సురేశ్‌ ఎంటర్టైన్‌మెంట్‌ ఎల్‌ఎల్‌పి తెలుగు వెర్షన్‌ను విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో ధనుష్‌ శక్తిమంతమైన లుక్‌లో కనిపించారు. కాళిదాస్‌ జయరామ్‌, ఎస్‌.జె సూర్య, సెల్వ రాఘవన్‌, అపర్ణ బాలమురళి, ధుషార విజయన్‌ ప్రధాన తారాగణం. ఏ.ఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాశ్‌. ఎడిటర్‌: ప్రసన్న జికె

Updated Date - Jun 12 , 2024 | 03:48 AM