జూన్‌లో రాయన్‌ రాక

ABN , Publish Date - May 11 , 2024 | 05:31 AM

ధనుష్‌ కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాయన్‌’. సందీప్‌ కిషన్‌, ఎస్‌జే సూర్య, సెల్వ రాఘవన్‌ కీలకపాత్రలు

జూన్‌లో రాయన్‌ రాక

ధనుష్‌ కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాయన్‌’. సందీప్‌ కిషన్‌, ఎస్‌జే సూర్య, సెల్వ రాఘవన్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రం తెలుగు రిలీజ్‌ హక్కులను ఏషియన్‌ సురేశ్‌ ఎంటర్టైన్‌మెంట్‌ ఎల్‌ఎల్‌పి దక్కించుకొంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని జూన్‌ 13న విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ శుక్రవారం ప్రకటించారు. అలాగే ఈ చిత్రం నుంచి ‘తలవంచి ఎరగడే’ అంటూ సాగే గీతాన్ని మేకర్స్‌ విడుదల చేశారు. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌. సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాశ్‌.

Updated Date - May 11 , 2024 | 05:31 AM