ప్రేక్షకులకు గుర్తుండిపోయే చౌర్యపాఠం

ABN , Publish Date - Feb 11 , 2024 | 03:20 AM

రవితేజ కథానాయకుడిగా నటించిన ‘ధమాకా’ చిత్రంతో దర్శకుడిగా నక్కిన త్రినాథరావు పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన నిర్మాతగా మారి ‘చౌర్య పాఠం’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు...

ప్రేక్షకులకు గుర్తుండిపోయే చౌర్యపాఠం

రవితేజ కథానాయకుడిగా నటించిన ‘ధమాకా’ చిత్రంతో దర్శకుడిగా నక్కిన త్రినాథరావు పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన నిర్మాతగా మారి ‘చౌర్య పాఠం’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంద్ర రామ్‌ కథానాయకుడు. పాయల్‌ రాధాకృష్ణ హీరోయిన్‌. నిఖిల్‌ గొల్లమారి దర్శకుడు. దర్శకుడు కార్తిక్‌ ఘట్టమనేని ఈ చిత్రానికి కథ అందించారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, టీజర్‌ని లాంచ్‌ చేసి ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు. గ్రామంలో దోపిడీకి హీరో తన ముఠాను సమాయత్తం చేయడంతో మొదలైన టీజర్‌ ఆధ్యంతం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా త్రినాథరావు మాట్లాడుతూ ‘నక్కిన నెరే టివ్‌ బేనర్స్‌ ఈ రోజు ప్రారంభమైంది. దీనికి ప్రేక్షకులు ఊపిరి, భవిష్యత్‌ను ఇవ్వాలి. ‘చౌర్య పాఠం’లో పాత్రలు ప్రేక్షకులకు గుర్తిండిపోతాయి’ అన్నారు. ఈ సినిమా కోసం నాగేంద్ర 14 సెట్స్‌ వేశారని ఇంద్రరామ్‌ తెలిపారు. త్రినాథరావు ఎక్కడా రాజీపడకుండా సినిమాను నిర్మించారని దర్శకుడు చెప్పారు.

Updated Date - Feb 11 , 2024 | 03:20 AM