రవితేజ 75వ సినిమా!

ABN , Publish Date - Jun 12 , 2024 | 03:49 AM

స్వయంకృషితో స్టార్‌ ఎదిగిన నటుడు రవితేజ. కామెడీ టైమింగ్‌లో, విలక్షణమైన డైలాగ్‌ డెలివరీతో ఆడియన్స్‌ను ఆకట్టుకొన్న ఆయన కొత్త చిత్రం మంగళవారం ప్రారంభమైంది. ఇది...

రవితేజ 75వ సినిమా!

స్వయంకృషితో స్టార్‌ ఎదిగిన నటుడు రవితేజ. కామెడీ టైమింగ్‌లో, విలక్షణమైన డైలాగ్‌ డెలివరీతో ఆడియన్స్‌ను ఆకట్టుకొన్న ఆయన కొత్త చిత్రం మంగళవారం ప్రారంభమైంది. ఇది ఆయనకు 75వ సినిమా కావడం విశేషం. సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న శ్రీలీల క్లాప్‌ కొట్టి షూటింగ్‌ ప్రారంభించడం విశేషం. ఈ చిత్రంతో రచయిత భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రానికి మాటల రచయితగా, ‘సామజవరగమన’ సినిమాకు స్ర్కీన్‌ప్లే రచయితగా పని చేసి మంచి గుర్తింపు పొందిన భాను భోగవరపు ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న 109వ చిత్రానికి మాటలు రాస్తున్నారు. ఆ చిత్రం నిర్మాణంలో ఉండగానే ఆయనకు దర్శకుడిగా అవకాశం రావడం గమనార్హం. పలు విజయవంతమైన చిత్రాలను నిర్మిస్తున్న సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


వినోదంతో కూడిన పూర్తి మాస్‌ పాత్రలో రవితేజను చూడాలని కోరుకుంటున్న ఆయన అభిమానులకు ఈ సినిమా పుల్‌ జోష్‌ ఇస్తుందని దర్శకనిర్మాతలు వెల్లడించారు. మంగళవారం నుంచే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతుందని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: నందు సవిరిగాన, సంగీతం: బీమ్స్‌ సిసిరోలియో, ఛాయాగ్రహణం: విధు అయ్యన్న, సమర్పణ: శ్రీకర్‌ స్టూడియోస్‌.

Updated Date - Jun 12 , 2024 | 03:50 AM