రవితేజ స్థాయుకి ఎదగాలి
ABN , Publish Date - Sep 30 , 2024 | 02:05 AM
హీరో రవితేజ తమ్ముడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా నటించిన చిత్రం ‘మిస్టర్ ఇడియట్’. సిమ్రన్ శర్మ హీరోయిన్. ‘పెళ్లిసందడి’ చిత్రంతో హిట్ అందుకొన్న దర్శకురాలు గౌరి రోణంకి దర్శకత్వంలో...
హీరో రవితేజ తమ్ముడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా నటించిన చిత్రం ‘మిస్టర్ ఇడియట్’. సిమ్రన్ శర్మ హీరోయిన్. ‘పెళ్లిసందడి’ చిత్రంతో హిట్ అందుకొన్న దర్శకురాలు గౌరి రోణంకి దర్శకత్వంలో జె.జె.ఆర్.రవిచంద్ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు ప్రశాంత్ వర్మ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ‘రవితేజ పరిశ్రమలో ఎందరినో ఎంకరేజ్ చేశారు. అందుకే మాధవ్‌ను సపోర్ట్ చేయడం నా బాధ్యతగా భావించి ఇక్కడికి వచ్చా. రవితేజ స్థాయికి మాధవ్ ఎదగాలని కోరుకుంటున్నా’ అన్నారు.
‘సంగీత దర్శకుడు అనూ్‌పకి మొదటే చెప్పా.. మీ సంగీతంతో సినిమా హిట్ కావాలని. ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతకు కృతజ్ఞతలు. ఆడియన్స్‌కు రీచ్ అయ్యే అంశాలతో సినిమా రూపొందించాను’ అని చెప్పారు దర్శకురాలు గౌరి. సినిమాను త్వరలో విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు.