రేవ్‌ పార్టీ కేసు.. మీడియాకే తెలియాలి

ABN , Publish Date - Jun 29 , 2024 | 03:32 AM

నటి హేమ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బెంగళూరు రేవ్‌పార్టీ వ్యవహారంలో అరెస్టయిన ఆమె బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం సాయంత్రం కాలినడకన తిరుమలకు చేరుకున్న హేమ...

రేవ్‌ పార్టీ కేసు.. మీడియాకే తెలియాలి

నటి హేమ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బెంగళూరు రేవ్‌పార్టీ వ్యవహారంలో అరెస్టయిన ఆమె బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం సాయంత్రం కాలినడకన తిరుమలకు చేరుకున్న హేమ శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ.. నేను చిన్నప్పటి నుంచి శ్రీవారి దర్శనానికి వస్తున్నాను, తిరుమల నాకు పుట్టినిల్లు అన్నారు. రేవ్‌ పార్టీ కేసు గురించి మీడియా ప్రశ్నించగా ‘మీకే తెలియాలి. మీరే వేస్తున్నారు కదా న్యూస్‌. మీ ద్వారానే నేనూ తెలుసుకుంటున్నా’ అని బదులిచ్చారు.

తిరుమల, (ఆంధ్రజ్యోతి)

Updated Date - Jun 29 , 2024 | 03:32 AM