రవన్న దావత్‌ ఇస్తుండు.. రెడీ అయిపోండ్రి

ABN , Publish Date - Apr 10 , 2024 | 01:50 AM

రవితేజ తన కెరీర్‌లో 75వ చిత్రం మైలు రాయిని చేరుకోవడానికి సిద్ధమయ్యారు. తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని ఆయన ల్యాండ్‌ మార్క్‌ ఫిల్మ్‌ను ప్రకటించారు....

రవన్న దావత్‌ ఇస్తుండు.. రెడీ అయిపోండ్రి

రవితేజ తన కెరీర్‌లో 75వ చిత్రం మైలు రాయిని చేరుకోవడానికి సిద్ధమయ్యారు. తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని ఆయన ల్యాండ్‌ మార్క్‌ ఫిల్మ్‌ను ప్రకటించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించే ఈ చిత్రం వివరాలు వెల్లడిస్తూ ఓ పోస్టర్‌ విడుదల చేశారు. దాని మీద ‘రవన్న దావత్‌ ఇస్తుండు.. రెడీ అయిపోండ్రి’ అని రాసి ఉంది. దీనిని బట్టి చూస్తే తెలంగాణ నేపథ్యంలో సాగే చిత్రమిదని అర్థమవుతుంది. ఇందులో రవితేజ పేరు లక్ష్మణ భేరి. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో రూపుదిద్దుకొనే ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే సంకాంత్రికి ఈ చిత్రం ‘ధూమ్‌ ధామ్‌ మాస్‌ దావత్‌’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, ఫొటోగ్రఫీ: కార్తిక్‌ ఘట్టమనేని, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి.

Updated Date - Apr 10 , 2024 | 01:50 AM