రష్మిక ఫేక్‌ వీడియో నిందితుడి అరెస్ట్‌?

ABN , Publish Date - Jan 21 , 2024 | 01:56 AM

రష్మిక మందన్నా డీప్‌ ఫేక్‌ వీడియో సామాజిక మాధ్యమంలో గత ఏడాది ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో తెలిసిందే. బ్రిటిష్‌ ఇండియన్‌ ఇన్‌ఫ్లుయన్సర్‌ జరా పటేల్‌ వీడియోకు రష్మిక ముఖాన్ని అతికించి...

రష్మిక ఫేక్‌ వీడియో నిందితుడి అరెస్ట్‌?

రష్మిక మందన్నా డీప్‌ ఫేక్‌ వీడియో సామాజిక మాధ్యమంలో గత ఏడాది ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో తెలిసిందే. బ్రిటిష్‌ ఇండియన్‌ ఇన్‌ఫ్లుయన్సర్‌ జరా పటేల్‌ వీడియోకు రష్మిక ముఖాన్ని అతికించి ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజన్స్‌ టెక్నాలజీ ద్వారా డీప్‌ ఫేక్‌ వీడియో క్రియేట్‌ చేసి విడుదల చేయడంతో ఆ వీడియో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసభ్యకరంగా ఉన్న ఆ వీడియోపై అమితాబ్‌ లాంటి లెజెండ్స్‌ సైతం స్పందించారు. రష్మిక అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ అంశంపై పలువురు సినీ సెలబ్రిటీస్‌ రష్మికకు మద్దతుగా నిలిచారు. గత ఏడాది నవంబర్‌ 10న ఈ ఘటనపై కేసు కూడా నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ గుంటూరుకు చెందిన ఈమని నవీన్‌(24)ను ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని దిల్లీ డీసీపీ హేమంత్‌ తివారీ వెల్లడించారు. ప్రధాన నిందితుడు ఇతడే అయ్యుండొచ్చనే అనుమానులున్నాయని, ఈ కారణంగానే అతని ల్యాప్‌టాప్‌, మొబైల్‌ని స్వాధీనం చేసుకొని విచారిస్తున్నట్టు ఆయన తెలిపారు. డిలిట్‌ చేసిన డేటాను సైతం పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నట్టు ఈ సందర్భంగా ఆయన వివరించారు. నిందితుడు నవీన్‌ గతంలో రష్మిక పేరు మీద ఫ్యాన్‌ పేజీ నడిపినట్టు సమాచారం. ఫాలోవర్లను పెంచుకునేందకే నవీన్‌ ఈ డీప్‌ఫేక్‌ వీడియో క్రియేట్‌ చేశాడనే అనుమానాన్ని డీసీపీ వ్యక్తం చేశారు. మరో ఇద్దరు ప్రముఖల పేర్లమీద కూడా తను ఫ్యాన్‌ పేజీ నడిపినట్టు సమాచారం.

Updated Date - Jan 21 , 2024 | 01:56 AM