Rashmi Gautam: 'జబర్దస్త్' గా కనిపిస్తున్న రష్మి గౌతమ్

ABN , Publish Date - Mar 16 , 2024 | 12:50 PM

రష్మి గౌతమ్ తెలుగువాళ్లందరికీ పరిచయం వున్న నటి, వ్యాఖ్యాత. ఒక పక్క సినిమాలు చేస్తూ, ఇంకో పక్క టీవీల్లో చాలా షోస్ కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఎంతోమంది అభిమానులను గెలుచుకున్న రష్మి తాజాగా కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది

Rashmi Gautam: 'జబర్దస్త్' గా కనిపిస్తున్న రష్మి గౌతమ్
Rashmi Gautam

వారం వారం టీవీ ఛానల్ లో 'జబర్దస్త్' షోతో ఎందరినో అభిమానులను సంపాదిస్తున్న రష్మి గౌతమ్ సామాజిక మాధ్యమాల్లో కూడా చాలా చురుకుగా ఉంటుంది. ఒక పక్క యాంకరింగ్ చేస్తూనే, మరో పక్క సినిమాల్లోనూ నటిస్తూ ఉంటుంది రష్మి. తన సామాజిక మాధ్యమం ద్వారా పెంపుడు జంతువులకు సపోర్టివ్ గా ఎక్కువగా మాట్లాడుతూ వాటిగురించి ఎంతో తపన పడుతూ ఉంటుంది రష్మి.

rashmigautamseven.jpg

అలాగే సామాజిక మాధ్యమాల్లో తన గురించి ఎవరైనా ఏమైనా మాట్లాడినా కూడా వెంటనే వాళ్ళకి తగు రీతిలో సమాధానం ఇస్తూ ఉంటుంది. సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు, సమస్యలపై కూడా సామాజికమాధ్యమంలో తనదైన రీతిలో గళం విప్పుతుంది రష్మి.

rashmigautamfive.jpg

రష్మి గౌతమ్ ఇప్పుడు కాదు సుమారు రెండు దశాబ్దాల క్రితమే సినిమాల్లోకి ఆరంగేట్రం చేసింది. ఉదయ్ కిరణ్ కథానాయకుడిగా నటించిన 'హోలీ' (2002) అనే సినిమా ద్వారా సినిమా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత వరసగా చాలా సినిమాలు చేసినా 2015లో వచ్చిన 'గుంటూరు టాకీస్' రష్మికి చాలా మంచి పేరు తీసుకొచ్చింది.

rashmigautamtwo.jpg

సినిమాలోనే కాకుండా టీవీ లో కూడా చాలా షోస్ కి యాంకరింగ్ చేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది రష్మీ. ఇప్పుడు 'జబర్దస్త్' షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది, అలాగే 'ఢీ' అనే షో కి కూడా వ్యాఖ్యాతగా చేస్తూ ఎంతోమంది అభిమానుల ప్రేమలను గెలుచుకుంటోంది రష్మి.

rashmigautamthree.jpg

తన సామాజిక మాధ్యమంలో ఎప్పటికప్పుడు తన తాజా ఫోటోలను పెడుతూ కనువిందు చేస్తూ ఉంటుంది. ఆమెకి స్టైల్ గా ఎలా ఉండాలో బాగా తెలుసనీ, అలాగే ఎటువంటి అవుట్ ఫిట్స్ వేసుకుంటే ఆమె బాగుంటుందో ఆమె అభిమానులు ఆమె ఫోటోలపై వ్యాఖ్యానాలు కూడా పెడుతూ వుంటారు. ఇన్‌స్టాగ్రామ్ లో రష్మికి 4.9 మిలియన్ ఫాలోవర్లు వున్నారంటే ఆమె ఎంత పాపులర్ సెలబ్రెటీనో అర్థం అవుతోంది కదా.

Updated Date - Mar 16 , 2024 | 12:50 PM