రాణి రుక్మిణీ దేవి

ABN , Publish Date - Mar 11 , 2024 | 03:30 AM

శ్రీవిష్ణు, రీతూవర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘శ్వాగ్‌’. ‘రాజ రాజ చోర’ ఫేమ్‌ హసిత్‌ గోలి దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై టి.జి విశ్వ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. రీతూ వర్మ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్‌ ...

రాణి రుక్మిణీ దేవి

శ్రీవిష్ణు, రీతూవర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘శ్వాగ్‌’. ‘రాజ రాజ చోర’ ఫేమ్‌ హసిత్‌ గోలి దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై టి.జి విశ్వ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. రీతూ వర్మ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్‌ ఆదివారం ఆమె ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. వింజమర వంశంలోని మహారాణి రుక్మిణి దేవిగా రీతూ వర్మను పరిచయం చేశారు. ఈ క్యారెక్టర్‌ ఇంట్రడక్షన్‌ వీడియోలో రీతూ వర్మ శ్రీవిష్ణు మాటలను పరిహాసం చేస్తూ కనిపించారు. మగవారి కంటే స్ర్తీలు గొప్పవారు, శక్తివంతులు అని చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌: వేదరామన్‌ శంకరన్‌, సంగీతం: వివేక్‌ సాగర్‌

Updated Date - Mar 11 , 2024 | 03:30 AM