‘రంగ్‌ రంగ్‌ రంగీలా’

ABN , Publish Date - Mar 05 , 2024 | 02:27 AM

హిలేరియస్‌ క్రైమ్‌ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం పారిజాత పర్వం. సునీల్‌, చైతన్య రావు, శ్రద్ధా దాస్‌ , మాళవిక సతీశన్‌ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. సంతోష్‌ కంభంపాటి దర్శకత్వం...

‘రంగ్‌ రంగ్‌ రంగీలా’

హిలేరియస్‌ క్రైమ్‌ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం పారిజాత పర్వం. సునీల్‌, చైతన్య రావు, శ్రద్ధా దాస్‌ , మాళవిక సతీశన్‌ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. సంతోష్‌ కంభంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. మహిధర్‌ రెడ్డి, దేవేష్‌ నిర్మిస్తున్నారు. సోమవారం ఈ చిత్రం నుంచి ‘రంగ్‌ రంగ్‌ రంగీలా’ అంటూ సాగే ఓ పాటను చిత్ర బృందం విడుదల చేసింది. సంగీత దర్శకుడు రీ క్యాచీ క్లబ్‌ నెంబర్‌గా ఈ పాటను కంపోజ్‌ చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ పాటని నటి శ్రద్ధాదాస్‌ పాడటం విశేషం. ఆమె వాయిస్‌, గ్లామరస్‌ ప్రజన్స్‌ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చాయి. ఈ చిత్రానికి ఎడిటర్‌-శశాంక్‌ వుప్పుటూరి, డీవీపీ-బాల సరస్వతి, సంగీతం-రీ, ఆర్ట్‌ డైరెక్టర్‌-ఉపేందర్‌ రెడ్డి, సహ నిర్మాత- అనంత సాయి.

Updated Date - Mar 05 , 2024 | 02:27 AM