రాముడి కోసం రెడీ అవుతున్న రణ్‌బీర్‌

ABN , Publish Date - Mar 27 , 2024 | 01:46 AM

బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ శ్రీరాముడి పాత్ర కోసం మానసికంగా, శారీరకంగా సిద్ధమవుతున్నారు. శ్రీరాముడు బాణం వేసి శత్రువుల్ని మట్టుపెట్డడంలో ఆరితేరిన వ్యక్తి కనుక రణ్‌బీర్‌ ఇప్పుడు విలువిద్య మీద దృష్టి పెట్టారు. విలువిద్యలో...

రాముడి కోసం రెడీ అవుతున్న రణ్‌బీర్‌

బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ శ్రీరాముడి పాత్ర కోసం మానసికంగా, శారీరకంగా సిద్ధమవుతున్నారు. శ్రీరాముడు బాణం వేసి శత్రువుల్ని మట్టుపెట్డడంలో ఆరితేరిన వ్యక్తి కనుక రణ్‌బీర్‌ ఇప్పుడు విలువిద్య మీద దృష్టి పెట్టారు. విలువిద్యలో ఆయన శిక్షణ పొందుతున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అలాగే శారీరకంగా మరింత ధృడంగా కనిపించడం కోసం ఎక్కువ సమయం జిమ్‌లోనే గడుపుతున్నారు. ‘రామాయణ్‌’ షూటింగ్‌ ఎప్పుడు మొదలవుతుంది, ఎవరెవరు ఏ ఏ పాత్రలు పోఫిస్తున్నారనే అధికారిక సమాచారాన్ని శ్రీరామ నవమి సందర్బంగా ఏప్రిల్‌ 17న దర్శకుడు నితిశ్‌ తివారి వెల్లడించనున్నారు. ఒక అద్భుతమైన దృశ్య కావ్యంగా ఈ చిత్రాన్ని రూపొందించడం కోసం నితిశ్‌, ఆయన టీమ్‌ ఐదేళ్లుగా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చేస్తోంది. ఎటువంటి విమర్శలకు తావు లేకుండా స్ర్కిప్ట్‌ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే విజువల్‌ ఎఫెక్ట్స్‌ అత్యద్భుతంగా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. సీతగా సాయిపల్లవి, రావణునిగా యశ్‌ నటించే ‘రామాయణ్‌’ చిత్రం 2025 దీపావళికి విడుదల అవుతుంది.

Updated Date - Mar 27 , 2024 | 01:46 AM