రూ.835 కోట్లతో రామాయణ

ABN , Publish Date - May 15 , 2024 | 12:21 AM

ప్రస్తుతం అందరి దృష్టీ బాలీవుడ్‌లో రూపొందుతున్న భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణ’ మీదే ఉంది. రణబీర్‌ కపూర్‌ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ కొనసాగుతోంది. చరిత్రలో నిలిచిపోయే విధంగా...

రూ.835 కోట్లతో రామాయణ

ప్రస్తుతం అందరి దృష్టీ బాలీవుడ్‌లో రూపొందుతున్న భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణ’ మీదే ఉంది. రణబీర్‌ కపూర్‌ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ కొనసాగుతోంది. చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ సినిమాను రూపొందించడానికి దర్శకుడు నితీశ్‌ తివారి కృషి చేస్తున్నారు. రెండు భాగాలుగా తయారవుతున్న ఈ సినిమా బడ్జెట్‌ ఎంతో తెలుసా? రూ. 835 కోట్లు. అది కూడా కేవలం తొలి భాగం కోసమే. నిర్మాణపరంగా ఎక్కడా రాజీ పడకుండా నిర్మాత నమిత్‌ మల్హోత్రా ఖర్చు పెడుతూ, భారతీయ భాషలన్నింటిలోకి సినిమాను విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. సినిమా షూటింగ్‌ ఒక ఎత్తు అయితే, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా ఎంతో కీలకం. అందుకే 600 రోజులు కేవలం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కోసం కేటాయించనున్నారు. విమర్శలకు ఎక్కడా తావు లేకుండా, భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా మరోసారి చాటే విధంగా ‘రామాయణ’ నిర్మాణం జరుగుతోంది. మరి ఈ పినిమా విడుదల ఎప్పుడు? ఆ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు ట్రేడ్‌ ఎనలిస్ట్‌ సుమిత్‌ కదెల్‌. ‘ 2027 అక్టోబర్‌లో ‘రామాయణ’ చిత్రం తొలి భాగం విడుదలవుతుంది’ అంటూ ఎక్స్‌ ఖాతా ద్వారా ఆయన వెల్లడించారు.

Updated Date - May 15 , 2024 | 09:06 AM