ఈ తరానికి రామానుజ సందేశం
ABN , Publish Date - May 29 , 2024 | 06:36 AM
డాక్టర్ సాయి వెంకట్ నటి స్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘జయహో రామానుజ’. సాయిప్రసన్న, ప్రవల్లిక నిర్మిస్తున్నారు. సుమన్, జో శర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు. రెండు భాగాలుగా...

డాక్టర్ సాయి వెంకట్ నటి స్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘జయహో రామానుజ’. సాయిప్రసన్న, ప్రవల్లిక నిర్మిస్తున్నారు. సుమన్, జో శర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తొలి భాగాన్ని జూలై 12న విడుదల చేస్తున్నారు. మంగళవారం ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి వెంకట్ మాట్లాడుతూ ‘మానవాళి ఐకమత్యంతో ఉండాలనే గొప్ప సందేశాన్ని ఇచ్చిన గురువు భగవత్ శ్రీ రామానుజాచార్యులు. వారి గొప్పదనం ఈ తరానికి తెలియాలనే ఈ సినిమాను తెరకెక్కించాను’ అన్నారు. ప్రవల్లిక మాట్లాడుతూ ‘ఈ సినిమా నిర్మాణంలో భాగమవడంతో పాటు కీలకపాత్ర పోషిస్తున్నాను. అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రమిది’ అని చెప్పారు.