రామ్‌చరణ్, రైమీ మైనపు విగ్రహం
ABN , Publish Date - Sep 30 , 2024 | 02:03 AM
ప్రతిష్ఠాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్‌చరణ్ మైనపు విగ్రహాన్ని త్వరలో ఆవిష్కరించనున్నారు. సింగపూర్‌లోని మ్యూజియంలో చరణ్‌తో పాటు ఆయన పెంపుడు కుక్క రైమీ విగ్రహాన్ని కూడా...
ప్రతిష్ఠాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్‌చరణ్ మైనపు విగ్రహాన్ని త్వరలో ఆవిష్కరించనున్నారు. సింగపూర్‌లోని మ్యూజియంలో చరణ్‌తో పాటు ఆయన పెంపుడు కుక్క రైమీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఐఫా వేడుకల్లో టుస్సాడ్స్ ప్రతినిధులు తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటో షూట్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మేడమ్ టుస్సాడ్స్ కుటుంబంలో భాగమవ్వడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నట్లు రామ్‌చరణ్ తెలిపారు.