మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ram Charan meets Pawan Kalyan: పిఠాపురంలో బాబాయిని కలిసిన అబ్బాయి

ABN, Publish Date - May 11 , 2024 | 04:47 PM

ఈరోజు ఉదయం హైదరాబాదునుండి రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకొని, అక్కడ నుండి కుక్కుటేశ్వర దేవాలయానికి వెళ్లి, ఆ తరువాత పిఠాపురంలో తన బాబాయ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని రామ్ చరణ్ కలిశారు. తన తల్లి సురేఖమ్మతో కూడా వెళ్లిన రామ్ చరణ్ ని చూసి పవన్ కళ్యాణ్ ఎంతో భావోద్వేగానికి గురైనట్టు కనపడుతోంది

Ram Charan meets Pawan Kalyan: పిఠాపురంలో బాబాయిని కలిసిన అబ్బాయి
Surekhamma, Pawan Kalyan and Ram Charan at Pithapuram

ప్రముఖ నటుడు, అభిమానులు గ్లోబర్ స్టార్ గా పిలుచుకునే రామ్ చరణ్ ఈరోజు పిఠాపురంలో జనసేన అధినేత, రామ్ చరణ్ కి బాబాయ్ అయిన పవన్ కళ్యాణ్ ని కలిశారు. రామ్ చరణ్ తన తల్లి సురేఖతో కలిసి వెళ్లి బాబాయి పవన్ కళ్యాణ్ ని కలిసి తన సంఘీభావం తెలిపారు.

ramcharanpk1.jpg

ఈరోజు ఉదయం హైదరాబాదు నుండి రామ్ చరణ్ బయలుదేరి రాజమహేంద్రవరం చేరుకున్నారు. అక్కడ విమానాశ్రయంలో రామ్ చరణ్ కి అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. అక్కడి నుండి కుక్కుటేశ్వర స్వామి దేవాలయం కి వెళ్లి, ఆ తరువాత పవన్ కళ్యాణ్ ని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఇంట్లో కలిశారు.

పవన్ కళ్యాణ్ తన వొదినమ్మ సురేఖని చూసిన తరువాత ఎంతో భావోద్వేగానికి గురయినట్టుగా కనపడుతోంది. గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ తన పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్న సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమ నుండి ఎంతోమంది పవన్ కళ్యాణ్ కి తమ మద్దతు తెలిపిన సంగతి కూడా తెలిసిందే.

రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ఆ తరువాత అక్కడికి వచ్చిన అభిమానులకి అభివాదం చేశారు. ఎంతో మంది జనసేన కార్యకర్తలు, మెగా అభిమానులు ఈరోజు పిఠాపురం చేరుకున్నారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఇద్దరూ వారు ఉంటున్న ఇంటిపైనుండే అభివాదం చెయ్యడం, అభిమానులు అందరూ ఆనందడోలికల్లో మునగడం కనిపించింది.

Updated Date - May 11 , 2024 | 04:47 PM