రకుల్ వెన్నెముకకు గాయం
ABN , Publish Date - Oct 17 , 2024 | 05:50 AM
బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గన్‌తో కలిసి ‘దే దే ప్యార్ దే 2’లో నటిస్తున్నారు రకుల్ ప్రీత్ సింగ్. సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ ప్రస్తుతం తన దృష్టినంతా బాలీవుడ్‌పైనే కేంద్రీకరించారు. అయితే, జిమ్‌లో రెగ్యులర్‌గా వర్కవుట్స్ చేసే రకుల్...
బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గన్‌తో కలిసి ‘దే దే ప్యార్ దే 2’లో నటిస్తున్నారు రకుల్ ప్రీత్ సింగ్. సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ ప్రస్తుతం తన దృష్టినంతా బాలీవుడ్‌పైనే కేంద్రీకరించారు. అయితే, జిమ్‌లో రెగ్యులర్‌గా వర్కవుట్స్ చేసే రకుల్... ఇటీవల 80 కిలోల బరువును లిఫ్ట్ చేసే క్రమంలో వెన్నెముకకు తీవ్ర గాయమైంది. ఆమె వర్కవుట్ బెల్ట్ పెట్టుకోకుండా భారీ వెయిట్ లిఫ్టింగ్ చేయడంతోనే గాయమైందని డాక్టర్లు నిర్ధారించారు. డాక్టర్ల సూచనల మేరకు ప్రస్తుతం రకుల్ ప్రీత్ బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. కాగా, సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో తన ఆరోగ్యంపై తాజా అప్‌డేట్స్ షేర్ చేసుకున్నారు రకుల్ ప్రీత్ . ‘ఆరు రోజుల నుంచి బెడ్ రెస్ట్ తీసుకుంటున్నాను. పూర్తిగా కోలుకోవడానికి మరో వారం రోజులు పడుతుంది. త్వరితగతిన కోలుకుంటాననే నమ్మకం నాకుంది. విశ్రాంతి భారంగా అనిపిస్తోంది’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రకుల్ పోస్ట్ చేశారు.