సన్నిహితుల సమక్షంలో రకుల్‌ వివాహం

ABN , Publish Date - Feb 22 , 2024 | 05:42 AM

హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన చిరకాల మిత్రుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ఆమె వివాహం గోవాలోని ఐటిసీ గ్రాండ్‌ రిసార్ట్స్‌లో...

సన్నిహితుల సమక్షంలో రకుల్‌ వివాహం

హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన చిరకాల మిత్రుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ఆమె వివాహం గోవాలోని ఐటిసీ గ్రాండ్‌ రిసార్ట్స్‌లో బుధవారం జరిగింది. ఉదయం సిఖ్‌ పద్ధతి ప్రకారం, సాయంత్రం సింధి సంప్రదాయ పద్ధతిలో జరిగిన వీరి వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. బాలీవుడ్‌ నుంచి అక్షయ్‌కుమార్‌, వరుణ్‌ ధావన్‌, జెనీలియా, టైగర్‌ ష్రాఫ్‌, శిల్పా శెట్టి, రాజ్‌ కుంద్రా, అర్జున్‌ కపూర్‌, ఆయుష్మాన్‌ ఖురానా తదితరులు హాజరయ్యారు.

Updated Date - Feb 22 , 2024 | 05:42 AM