వచ్చే నెల్లో రకుల్‌ పెళ్లి

ABN , Publish Date - Jan 02 , 2024 | 05:12 AM

పంజాబీ భామ రకుల్‌ ప్రీత్‌సింగ్‌, ఆమె బాయ్‌ఫ్రెండ్‌, నిర్మాత జాకీ భగ్నానీ పెళ్లి తేదీ ఫిక్స్‌ అయింది. మూడేళ్ల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట ఫిబ్రవరి 22న జరిగే వివాహంతో ఒకటి కానుంది. . ‘రకుల్‌, జాకీల పెళ్లి...

వచ్చే నెల్లో రకుల్‌ పెళ్లి

పంజాబీ భామ రకుల్‌ ప్రీత్‌సింగ్‌, ఆమె బాయ్‌ఫ్రెండ్‌, నిర్మాత జాకీ భగ్నానీ పెళ్లి తేదీ ఫిక్స్‌ అయింది. మూడేళ్ల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట ఫిబ్రవరి 22న జరిగే వివాహంతో ఒకటి కానుంది. . ‘రకుల్‌, జాకీల పెళ్లి వచ్చే నెల 22న గోవాలో జరుగుతుంది. ఆర్బాటాలు ఏమీ లేకుండా అతి కొద్దిమంది కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య పెళ్లి చేసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం జాకీ బ్యాంకాక్‌లో స్నేహితులతో బ్యాచ్‌లర్‌ పార్టీతో బిజీగా ఉన్నారు. రకుల్‌ కూడా ఽథాయ్‌లాండ్‌లోనే ఉంది’ అని ఆంగ్ల వెబ్‌ సైట్లు వెల్లడించాయి. నూతన సంవత్సరం తొలి రోజున వచ్చిన ఈ తీపి కబురుతో రకుల్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2021 అక్టోబర్‌లో తన పుట్టిన రోజున జాకీతో తను ప్రేమలో ఉన్న విషయాన్ని రకుల్‌ బయట పెట్టింది. అతనే తన ప్రపంచం అని కూడా పేర్కొంది. ఇక అప్పటినుంచి ఏ పార్టీకి వెళ్లినా ఇద్దరూ కలసే వెళుతున్నారు. వీర్దిద్దరి పెళ్లి త్వరలో జరుగుతుందనే వార్తలు కొంతకాలంగా వినబడుతున్నాయి కానీ ఇద్దరూ ఆ విషయం గురించి ఎక్కడా స్పందించలేదు. పెళ్లి గురించి తొందరపడడం లేదని రకల్‌ ఇటీవలే చెప్పారు. ఇది జరిగిన నెల రోజులకే ఈ పెళ్లి వార్త బయటకు వచ్చింది. రకుల్‌ ప్రస్తుతం తెలుగులో ఏ సినిమాలు చేయడం లేదు కానీ కమల్‌హాసన్‌ నటిస్తున్న ‘ఇండియన్‌ 2’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే జాకీ నిర్మించిన ‘బడే మియా ఛోటే మియా’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

Updated Date - Jan 02 , 2024 | 05:12 AM